హైద‌రాబాద్ లో బాలిక‌ను ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్ ఇప్పుడెక్క‌డ‌పోయారు : శ్రీరెడ్డి

-

శ్రీరెడ్డి న‌టి కంటే వివాదాస్ప‌ద న‌టి అన‌డ‌మే బెట‌ర్. టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాల్లో క‌నిపించిన శ్రీరెడ్డి ఎప్పుడూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. సినిమాల‌తో పాటూ రాజ‌కీయ సామాజిక అంశాల‌పై శ్రీరెడ్డి త‌న‌దైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది. ఇక తాజాగా శ్రీరెడ్డి టీడీపీ నేత వినోద్ జైన్ లైగింక వేధింపుల కార‌ణంగా బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న పై స్పందించింది. శ్రీరెడ్డి మాట్లాడుతూ…ఓ వికృత ఆనందం పొంది అరెస్ట్ అరెస్ట్ అయ్యాడు.

ఓకే కానీ చంద్ర‌బాబు నాయుడు స‌తీమణిని ఏదో అన్నార‌ని ప‌లువురు టీడీపీ నేత‌లు చంపుతామ‌ని వార్నింగ్ లు ఇచ్చార‌ని వాళ్లంతా ఇప్పుడు ఎక్క‌డ పోయార‌ని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ స్థాయి వ్య‌క్తి చిన్నారిని లైగింకంగా వేధింపుల‌కు గురిచేసి ఆత్మ‌హ‌త్య చేసుకునేలా చేస్తే లోకేష్, చంద్ర‌బాబు ,అనిత ఎక్క‌డ పోయారంటూ ఆగ్రహం వ్య‌క్తం చేసింది. కొన్ని టీవీ ఛానల్స్ ఎందుకు పట్టించుకోవ‌డం లేదు…ఛానల్స్ అధినేత‌లు ఎక్క‌డ పోయారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. వంగ‌పూడి అనిత నారీదీక్ష ఎందుకు చేయ‌డం లేదంటూ శ్రీరెడ్డి ప్ర‌శ్నించింది.

అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఏకంగా గ‌తంలో మ‌హిళ‌ల‌పై చేయి చేసుకున్నారంటూ వ్యాఖ్యానించారు. కొంత‌మంది టీడీపీ మ‌హిళ నేత‌లు ఆడ‌జాతిలో పుట్టి ఆడ‌జాతి ప‌రువు తీస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. శ్రీశ్రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ పోయారంటూ శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసింది. హైద‌రాబాద్ లో బాలిక చ‌నిపోయిన‌ప్పుడు వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ పోయారంటూ మండిప‌డింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ నోట్లో ప్యాకేజి పెట్టుకున్నారా అంటూ శ్రీరెడ్డి మండిప‌డింది. టీడీపీకి చెందిన వ్య‌క్తి ఆడ‌పిల్ల‌ను చంపితే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ పోయారు అంటూ ప్ర‌శ్నించింది.

Read more RELATED
Recommended to you

Latest news