బిగ్ బాస్:లిప్ లాక్ తో రెచ్చిపోయిన శ్రీహాన్ ,సిరి.!

-

తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది.. ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు.ప్రస్తుతం ఈ వారంలో హౌస్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఒక్కరొక్కరిగా బిగ్ బాస్  హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. దానితో చాలా పుటేజ్ మొత్తం ఏడుపు,  ఎమోషన్ తో నిండి పోయింది.

ఇక గురువారం ఎపిసోడ్ లో  శ్రీహాన్ లవర్ సిరి హనుమంతు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూసి శ్రీహాన్ ఎమోషనల్ అయ్యాడు. ఏడ్చేశాడు. శ్రీహాన్‌ను ముద్దులు ఇస్తూ మురిపించింది సిరి . ఏడిస్తే ముద్దులు పెట్టడం ఆపేస్తానని అన్నది. శ్రీహాన్ చూసి చాలా సన్నబడిపోయావని, నీ ఫుడ్ మొత్తం శ్రీసత్యనే తింటుందని శ్రీ సత్య ను టీజ్ చేసింది.శ్రీహాన్ పేరును మెడపై టాటూగా వేసుకున్నట్లు మంచి రొమాంటిక్ సాంగ్ తో దాన్ని చూపింది.

ఆ తర్వాత శ్రీహాన్ కొడుకు లా పెంచుతున్న చైతూ కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని నవ్వించాడు. హౌజ్‌మేట్స్‌ను ఇమిటేట్ చేశాడు. టాస్క్‌లలో ఎమోషన్స్‌, బాండింగ్ పెట్టుకోవద్దని శ్రీహాన్‌కు సలహాలు ఇచ్చింది సిరి. ఆ తర్వాత సిరి, శ్రీహాన్ కలిసి డ్యాన్స్ చేశారు. చివరిగా మరోసారి హగ్ చేసుకొని మంచి లిప్ కిస్ ఇచ్చి మోటివేషన్ చేసింది. ఇక ఇది చూసిన నెటిజన్స్ గత సీజన్లో షణ్ముక్ ఇచ్చిన ముద్దులు గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news