నిధి కోసం సినిమా లెవల్లో స్కెచ్‌ వేసిన దొంగలు.. ఏకంగా రాత్రికి రాత్రే..

-

దొంగతనం చేయడానికి దొంగలు ఎంతకైనా తెగిస్తారు..నెలల తరబడి రెక్కీ వేసి..అందుకు తగ్గట్టుగా కార్యచరణ పాటిస్తారు.. ఆ మధ్యకాలంలో.. ఓ దొంగ అయితే.. దొంగతనం చేసేందుకు నెలల పాటు శ్రమించి బరువు కూడా తగ్గాడు.. ఇక మనకు పాత సినిమాల్లో సొరంగాలు తవ్వి మరీ దొంగతనాలు చేసేవాళ్లు.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎవరూ చేయటం లేదు. కానీ ఇప్పుడు… సినిమా స్టైల్‌లో కాన్పూర్‌లో నిధి కోసం దొంగలు రాత్రికి రాత్రే మూడు మీటర్ల పొడవైన సొరంగం(Tunnel) తవ్వారు. కానీ చివరకి ఏం జరిగిందంటే..
కాన్పూర్‌లోని ఘతంపూర్లో.. నాగేలిన్‌పూర్ గ్రామంలోని శివాలయం పక్కన ఉన్న మట్టి దిబ్బలో సొరంగం తవ్వారు. నిధిని దొంగిలించేందుకు అక్కడి నుంచి సొరంగం లోపల ఇంకో సొరంగం కూడా తవ్వారు. అదేవిధంగా హిర్ని మోడ్ సమీపంలో కొన్నేళ్ల క్రితం బావి మట్టిని తవ్వారు. నిజానికి గ్రామంలోని ఈ శివాలయం వందల సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ ఆలయం కింద నిధి దాగి ఉందని గ్రామస్థులు నమ్ముతారు. గుడి గుట్టలో పెద్ద నిధి దాగి ఉందని తమ పెద్దలు చెబుతుంటారని, దీనిపై గ్రామంలో ప్రతిరోజూ చర్చ జరుగుతుందని గ్రామస్తులు వెల్లడించారు. ఈ దురాశలో ఎవరో పురాతన ఆలయ గుట్టను తవ్వారు.

సొరంగం ఎలా బయటపడింది?

ఓ రోజు పశువులను మేపేందుకు గ్రామస్తులు ఆలయ సమీపంలోకి వెళ్లగా.. ఈ సొరంగం గురించి తెలుసుకున్నారు. సొరంగం గురించిన సమాచారం గ్రామంలో ఆ నోట ఈ నోట పాకి..మొత్తం అందరికి తెలిసింది. కానీ ఎవరూ ధైర్యం చేసి సొరంగంలోకి ప్రవేశించలేకపోయారు. గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. సొరంగం లోపల చూసినప్పుడు, మరొక సొరంగం తయారు చేయబడింది, ఈ సొరంగం దాదాపు 3 మీటర్ల పొడవు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ విషయంపై తనకు సమాచారం వచ్చిందని, విచారణ జరుపుతామని ఘతంపూర్‌ ఎస్‌డిఎం అమిత్‌ గుప్తా వెల్లడించారు. నిధి కోసం దొంగలు సొరంగాలు తవ్వినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని అన్నారు.. పురాతన ఆలయాలు మన సంప్రదాయాలకు, చరిత్రకు చిహ్నాలు.. కానీ వాటిని ఇలాంటి కొందరు.. దురాశకు పోయి ఏదో ఉందనుకోని..పాడుచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news