మనకి ఉన్న ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి. పాన్ కార్డు ట్రాన్సాక్షన్స్ కోసం అవసరం అలానే పాన్ కార్డు ఎన్నో వాటికి అవసరం అవుతుంది. అయితే పాన్ కార్డుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇక దాని కోసం పూర్తి వివరాలని చూస్తే..
2023-24 కేంద్ర బడ్జెట్ సందర్భంగా దీనిపై ప్రకటన వచ్చే అవకాశం వుంది. అయితే ఇక నుండి కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్ కి ఇక నుండి పాన్ కార్డు అవసరం ఉండదట. బడ్జెట్ 2023లో తీసుకోనున్న మార్పుల్లో ఈ మార్పు కూడా చేయనున్నారు. ఇదిలా ఉంటే పాన్ కార్డు వివరాలని ఇవ్వకుండా చేసిన ట్రాన్సక్షన్స్ మీద 20 శాతం TDS వసూల్ చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనలను క్లిష్టం నుంచి సరళంగా మార్చాలని చూస్తోంది ఆర్ధిక శాఖ. అందరి పర్సనల్ బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్లు ఇప్పటికే లింక్ అయ్యాయి. అయితే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి పాన్ కార్డుకు బదులు ఆధార్ ఉంటే సరిపోతుందా అనేది పరిశీలిస్తున్నారు. ఇప్పుడైతే 18 రకాల ట్రాన్సాక్షన్స్కు పాన్ కార్డు తప్పనిసరిగా అవసరం అవుతోంది. అలానే ఎవరి దగ్గర కూడా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్స్ వుండకూడదు. ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటే పది వేలు ఫైన్ తప్పదు.