సీఐ వేధిస్తున్నాడు..చచ్చిపోతున్నా…యువకుడి సెల్ఫీ సూసైడ్…!

సీఐ వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ ఓ యువకుడు లైవ్ లో పురుగుల మందు తాగాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా తంగాల్లపల్లి మండలం బస్వాపూర్ లో చోటు చేసుకుంది. గొలిసెల దిలీప్ (23) అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కాగా తనను సిరిసిల్ల టౌన్ సిఐ అరుణ్ కుమార్ అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నాడు అని తప్పుడు కేసు పెట్టి జైలుకు కూడా పంపించాడు అని ఆరోపించాడు. ఆదివారం తనపై మరోకేసు నమోదు చేసి స్టేషన్ కు రమ్మన్నాడు అని చెబుతూ లైవ్ లో పురుగుల మందు తాగాడు.

Young boy suside attempt
Young boy suside attempt

దాంతో వెంటనే అతడి లైవ్ లొకేషన్ ను ట్రేస్ చేసి 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దిలీప్ ఓ యువతిని వేధించాడని ఆమె ఫోటోలు తీసి వేధింపులకు గురి చేశాడని సీఐ చెబుతున్నారు. యువతి ఫిర్యాదు తోనే అతడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించామని తెలిపారు. అయినా వేధింపులకు గురి చేయడంతో షీటీమ్ సూచన తో మరో కేసు నమోదు చేశామని చెప్పారు.