బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వేముల వాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటడు.. వీళ్లిద్దరేమే కాళ్లల్లో కట్టపెట్టినట్టు మాట్లాడుతున్నారు. పది సంవత్సరాలు మీరు ఇవన్నీ చేసి ఉంటే రుణమాఫీ చేయాల్సిన అవసరం వస్తుండెనా..? అసలు, మిత్తి కలిపి రైతులు కట్టలేక ఆత్మహత్యలల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అంటివి.. ఐదేళ్ల అయినా పూర్తి చేయలేదు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. లెక్కలన్ని వినిపిస్తానని తెలిపారు. 25 రోజుల్లో 23 కుటుంబాలకు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేసింది. రూ.2లక్షల లోపు రుణమాఫీ చేస్తే.. అభినందించాల్సింది పోయి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.
తండ్రి, కొడుకు, అల్లుడు సంసారం చేసినోళ్లలాగా మాట్లాడటం లేదు. పదేళ్లలో ఏమి ఎలగబెట్టారో చెప్పండి అని ప్రశ్నించారు. మీ నొప్పికి మా కార్యకర్తలు మందు పెడుతారు. మొదటి ఐదేళ్లలో ఎంత రుణమాఫీ చేసినవి లెక్క తీద్దామని చెప్పారు. 2014-18 వరకు, 2018-23 డిసెంబర్ వరకు, 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఎవరు రుణమాఫీ చేశారో తెలుస్తది. 10నెలల్లో 50వేల ఉద్యోగాలు ఎవ్వరూ ఇవ్వలేదు. 10 ఏళ్లలో ఇవ్వలేదని తెలిపారు. మా సచ్చిపోయిన బర్రె కుండనిండ పాలు ఇస్తుందన్నట్టు బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని సెటైర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి.