ఫామ్ హౌస్ కేసులో సిట్ విచారణ వేగవంతం

-

దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏర్పాటైన సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ కేసులో కీలకంగా ఉన్న తుషార్ కు నోటీసులు జారీ చేసింది. ఈనెల 21న సీట్ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొంది. బయటపడ్డ వీడియోలలో రామచంద్ర భారతి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ల సంభాషణలో తుషార్ పేరు పదేపదే వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే అతనిని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని సిట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం. అయితే తుషార్ ప్రస్తుతం కేరళ ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నారు. మరోవైపు కేరళలో సీట్ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news