డేటా చోరీ కేసులో 19 మంది అరెస్టు.. HDFCని విచారిస్తే క్లారిటీ వస్తుందన్న సిట్

-

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సిట్ పోలీసులు తెలిపారు. బిగ్ బాస్కెట్​కు చెందిన 3 కోట్ల మంది ఖాతాదారుల వివరాలు బయటికి వెళ్లాయని.. ఆ సంస్థ ప్రతినిధులు సైతం ఒప్పుకున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. పాలసీబజార్ వినియోగదారుల వివరాలు బయటికెళ్లిన విషయాన్ని గుర్తించిన సంస్థ ప్రతినిధులు గతేడాది అక్టోబర్​లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేలిందన్నారు.

హెచ్​డీఎఫ్​సీ ఖాతాదారులకు చెందిన 7.5 జీబీ డేటా బయటికి వెళ్లినట్లు గుర్తించామని.. బ్యాంకు ప్రతినిధులు మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదని పేర్కొంది. హెచ్​డీఎఫ్​సీ ప్రతినిధులు విచారణకు వస్తే దీనికి సంబంధించి మరింత స్పష్టత వస్తుందని సిట్ అధికారులు వ్యాఖ్యానించారు.  ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని సిట్ అధికారులు తెలిపారు.

గూగుల్ క్లౌడ్​లో వ్యక్తిగత వివరాలు పెట్టి విక్రయాలు చేస్తున్నారని.. క్లౌడ్​లో వివరాలు పెట్టిన వాళ్ల గురించి చెప్పాలని గూగుల్​కు లేఖ రాసినట్లు వివరించారు. గూగుల్ నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా దర్యాప్తు ముందుకు వెళుతుందని.. ఈ క్రమంలోనే దర్యాప్తులో కాస్త ఆలస్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news