జగన్ ప్రభుత్వంలో అవినీతిని చూడలేకే రాజీనామా: శివశ్రీ

అమరావతి: తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి యువతి శివశ్రీ విడుదల అయ్యారు. ఈ సందర్బంగా శివశ్రీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అవినీతిని చూడలేకే వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశానని శివశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు న్యాయం కోసం పవన్ ను కలిస్తే పోలీసులు బెదిరించారన్నారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఇదేనా జగన్ పాలన అంటే అని శివశ్రీ ప్రశ్నించారు.

కాగా నిర్వాసితులకు ప్రభుత్వ ఇల్లు రాలేదని.. న్యాయం చేయాలంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి అమరారెడ్డినగర్​కు చెందిన శివశ్రీ ఇటీవలే పవన్ కల్యాణ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయనను కలిసిన కారణంతోనే పోలీసులు శివశ్రీని స్టేషన్​కు పిలిపించి హెచ్చరించారు. అకారణంగా గొడవ చేస్తే ..కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

 

అయితే రెండురోజుల క్రితం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తనను పోలీస్ స్టేషన్‌లో వేచి ఉండేలా చేశారని శివశ్రీ చెప్పారు. పవన్ కల్యాణ్ ముందు మేకా రామిరెడ్డి పేరు చెప్పినందుకు టార్చర్ చేస్తున్నారని చెప్పారు. ఇంటి గురించి అడిగితే పవన్ కల్యాణ్‌ను అడుక్కో.. లోకేశ్‌ను అడుక్కో అంటూ అవహేళనకు గురిచేస్తున్నారని శివశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.