తెలంగాణాలో ఆరు హాట్ స్పాట్స్ ఇవే…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కరోనా వైరస్ పై యుద్ధం చేయడానికి సిద్దమైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 154 పాజిటివ్ కేసులు నమోదు కాగా… వీరిలో 17 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 128 యాక్టివ్ కేసులు ఉండగా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం ఆరు హాట్ స్పాట్స్ ని గుర్తించింది. ప్రధాన మంత్రి కూడా దీని విషయమై ముఖ్యమంత్రులకు పలు సూచనలు చేసారు. ఈ నేపధ్యంలోనే ఆరు కరోనా హాట్ స్పాట్స్ ని గుర్తించింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు కరోనా హాట్ స్పాట్స్‌ను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం. భైంసా, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ పాతబస్తీ, గద్వాల్, మిర్యాలగూడను హాట్ స్పాట్స్‌గా గుర్తించారు.

కరోనావ్యాధి సోకి కూడా ఇన్నాళ్లు బయటకు చెప్పని ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు హాట్ స్పాట్స్‌గా గా గుర్తిస్తారు. ఆ ప్రాంతాల్లో లాక్ డౌన్ ని మరింత కఠినం గా అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. దేశ రాజధాని ఢిల్లీ లో మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి కరోనా ఎక్కువగా సోకుతున్న నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం హాట్ స్పాట్స్ ని గుర్తించింది.

Read more RELATED
Recommended to you

Latest news