ఏప్రిల్ 5 లైట్స్ ఆర్పేయండి… మోడీ సందేశం…!

-

దేశం అంతటా కరోనాపై బాగా యుద్ధం చేస్తుందని ఈ విషయంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది అన్నారు. ప్రతీ ఒక్కరు ఇంట్లో ఉంటే కరోనా వైరస్ ని జయించినట్లే అని మోడీ అభిప్రాయపడ్డారు. ఐక్యంగా పోరాడితే కరోనాపై గెలుస్తామని అన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని వీడియో సందేశం ఇచ్చారు. మన దేశాన్ని అన్ని దేశాలు అనుసరిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఏప్రిల్ 5 న అందరూ కరోనా చీకట్లు తరిమివేయాలని సూచించారు. అందరూ రాత్రి 9 గంటల 9 నిమిషాలకు లైట్లు ఆపివేయాలని ఆయన సూచించారు. భారతీయులు అంతా ఏకమై కరోనా వైరస్ ని తరిమి కొడతారని అన్నారు.కరోనాపై యుద్ధం ఇంకా కొనసాగించాలని, ఇంకా పోరాడితేనే తరిమి కొట్టే అవకాశం ఉంటుందని అన్నారు. లైట్లు ఆపేసి ప్రజలు అందరూ దీపాలు వెలిగించాలని మోడీ సూచించారు. లైట్స్ ఆపేసి మొబైల్ ఫ్లాష్ లేదా కొవ్వొత్తి వెలిగించాలని అన్నారు.

దేశ ప్రజలు సంకల్ప శక్తిని వెలిగించాలని ఆయన సూచించారు. 9 నిమిషాల పాటు అందరూ లైట్స్ ఆపేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఏప్రిల్ 5 న చేసే కార్యక్రమంలో అందరూ సామాజిక దూరం పాటించాలని అన్నారు. ఈ 9 నిమిషాలు తనకు ఇవ్వాలని, కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. 130 కోట్ల మంది సంకల్ప శక్తిని చాటాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news