వరదల కారణంగా మరో ఆరుగురి మృతి..! ఎక్కడంటే..?

-

అస్సాంలో సోమవారం వరదల కారణంగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 50కి పెరిగింది. కొండచరియలు విరిగిపడడం వల్ల మరో 26 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని 27 జిల్లాల్లోని 2,763 గ్రామాలకు చెందిన 21.63 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. కాగా ప్రస్తుతం అస్సాంలో 20 జిల్లాలో ఏర్పాటు చేసిన 480 పునరావాస కేంద్రాల్లో 60,696 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలా ఉండగా వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ రూ.2 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు.

రాష్ట్రంలోని వరద పరిస్థితులపై ప్రధాని మోడీ అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌తో మాట్లాడారు. కేంద్రం నుంచి సాధ్యమైనంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే హోంమంత్రి అమిత్ షా కూడా ఆ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రుతుపవనాల స్థితి, దేశవ్యాప్తంగా వరదలు సంభవించే నదుల గురించి ఆయన ఆరా తీశారు. పంటలు, ఆస్తి, జీవనోపాధితో పాటు జనం ప్రాణాలను కాపాడటానికి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు హోం శాఖ అధికారులు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news