సుప్రీంలో పరీక్షల వాయిదా కై ఆరు రాష్ట్ర మంత్రులు పిటిషన్..!

-

సెప్టెంబరులో జరగాల్సిన నీట్​, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి బిజేపియేతర పాలనలోని ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు. పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని గతంలో ఇచ్చిన తీర్పును పునర్​సమీక్షించాలని కోరాయి. ఈ మేరకు ఆరు రాష్ట్రాల మంత్రులు(బంగాల్​ నుంచి మొలోయ్​ ఘటక్​, ఝార్ఖండ్​ నుంచి రామేశ్వర్​ ఒరాన్​, రాజస్థాన్ నుంచి రఘు శర్మ, ఛత్తీస్​గఢ్ నుంచి అమర్జీత్ భగత్, పంజాబ్​ నుంచి బీఎస్ సిద్దు, మహారాష్ట్ర నుంచి ఉదయ్ రవీంద్ర సావంత్​) సుప్రీంలో రివ్యూ పిటిషన్​ దాఖలు చేశారు. నీట్, జేఈఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని ఆగస్టు 17న తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. కరోనా కారణంగా ఎంతో విలువైన ఏడాది కాలాన్ని విద్యార్థులు కోల్పోవడానికి వీల్లేదని తెలిపింది.నీట్​, జేఈఈ వాయిదా కోసం న్యాయపోరాటం చేసే అంశంపై ఇటీవల బిజేపియేతర పార్టీల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చ జరిగింది.


కళాశాలలు, వర్సటీల చివరి సంవతర్సం పరీక్షల నిర్వహణపై తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు. సెప్టెంబర్​ 30 లోపు పరీక్షలు నిర్వహించకుండా రాష్ట్రాలు, వర్సటీలు విద్యార్థులను ప్రమోట్​ చేయొద్దని స్పష్టం చేసింది. ఫైనల్​ ఇయర్​ పరీక్షలు నిర్వహించాలన్న యూనియన్​ గ్రాంట్స్​ కమిషన్ (యూజీసీ) నిర్ణయాన్ని సమర్థించింది జస్టిస్​ అశోక్​ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసం. ఏదైన రాష్ట్రం పరీక్షలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఉంటే.. గడువు పెంచాలని యూజీసీని సంప్రదించాలని సూచించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరణంలో పరీక్షలు నిర్వహించాలని యూజీసీ నిర్ణయించటాన్ని సవాల్​ చేస్తూ.. శివసేన యూత్​ వింగ్​ యువ సేనాతో పాటు పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Read more RELATED
Recommended to you

Latest news