శివ కార్తీకేయన్‌తో ‘జాతిరత్నాలు’ దర్శకుడి సినిమా.. అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

-

‘జాతిరత్నాలు’ చిత్రంతో డైరెక్టర్ అనుదీప్ కేవీ తెలుగు సినీ లవర్స్ ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు. ఈ చిత్రంలోని కామెడీ ని చూసి ప్రతీ ఒక్కరు తెగ నవ్వుకున్నారు. ఈ క్రమంలోనే అనుదీప్ నెక్స్ట్ ఫిల్మ్ ఎవరితో చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తర్వాత చిత్రం కోలీవుడ్ హీరో శివకార్తీకేయన్ తో చేస్తున్నట్లు ప్రకటించారు.

SK20గా వస్తున్న ఈ చిత్ర అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 9న చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఉక్రెయిన్ దేశానికి చెందిన మ‌రినా ర్యాబొశ‌ప్క ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నది.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్టును శ్రీ వెంక‌టేశ్వర సినిమాస్ SLP, సురేశ్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా, ‘ఎస్ కే 20’పైన బోలెడన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. శివకార్తీకేయన్ ‘రెమో’గా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా, ఎస్ కే 20 సినిమాపైన అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news