ఎస్సార్ నగర్ ఫర్నీచర్ షాప్ లో అస్థి పంజరం కలకలం

Join Our Community
follow manalokam on social media

ఎస్సార్ నగర్ లో ఒక గుడికి సంబంధించిన గోదాంలో అస్థిపంజరం కలకలం రేపింది. గోదాంను ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన కార్పెంటర్ అద్దెకు తీసుకున్నారు. ఆ గోదాంలో కార్పెంటర్ వర్క్‌ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే లాక‌ డౌన్ విధించడంతో పనిలేక తన స్వగ్రామానికి కార్పెంటర్ వెళ్ళి పోయాడు. అయితే  ఎనిమిది నెలలుగా గోదాం లాక్ వేసి ఉన్నట్టు చెబుతున్నారు. దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో టెంపుల్ నిర్వాహకులు తాళం విరగొట్టి చూడగా పాత చెక్క పెట్టెలో అస్థిపంజరం కనపడటంతో భయాందోళనలకు గురయ్యారు స్థానికులు, ఆలయ నిర్వాహకులు. దీంతో ఘటనా స్థలానికి వచ్చి క్లూస్ టీమ్ తో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అస్థి పంజరం ముప్పై ఏళ్ళ ఓ యువకుడిదిగా గుర్తించారు. కార్పెంటర్ దొరికితేనే చనిపోయింది ఎవరన్న విషయం తెలిసే అవకాశం కనిపిస్తోంది. కార్పెంటర్ ఆచూకీ గుర్తించే పనిలో ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు ఉన్నారు.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...