జగన్ మాస్టర్ ప్లాన్.. వాలంటీర్లకు సన్మానం ?

Join Our Community
follow manalokam on social media

సెక్రటేరియట్‌లో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం  వైయస్‌.జగన్‌ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి భుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్‌ దాస్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు అజేయ కల్లం, నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికార యంత్రాంగంలో స్థైర్యం చాలా దిగువకు ఉండేదని, జన్మభూమి కమిటీల పేరిట పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. కేంద్రంతో, పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు దెబ్బతినే స్థాయిలో ఉన్నాయని కానీ అలాంటి పరిస్థితి నుంచి మనం ప్రయాణం మొదలుపెట్టామని అన్నారు. గత ప్రభుత్వంలో పాలన మండలాల స్థాయిలో ఉండేదని కానీ మనం గ్రామాల స్థాయికి పరిపాలనను తీసుకెళ్లామని అన్నారు.

గ్రామస్థాయిలోకి పాలనను తీసుకెళ్లడం వల్ల లంచాలకు ఆస్కారం లేకుండా చేశామని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు తప్పకుండా పథకాలు అందాలని, ఇక్కడ వాలంటీర్లది కీలక పాత్ర అని అన్నారు. వాలంటీర్లది సేవ అని పేర్కొన్న ఆయన వారిని మోటివేట్‌ చేయాలని అన్నారు. దీనికోసం ఒక ఆలోచన చేశామని ఉగాది రోజు ప్రతి నియోజకవర్గంలో వాలంటీర్లను సత్కరించాలని అన్నారు. ప్రతి జిల్లాలో ఉగాది నుంచి ప్రతి రోజూ రోజుకు ఒక నియోజకవర్గంలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమం జరుగుతుందని, కలెక్టర్, ఎస్పీ, జేసీ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈకార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. వారిని పోత్సహించడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నామని వారు చేసేది ఉద్యోగం కాదు, సేవ అందుకే వారిని మోటివేట్‌ చేయాలని అన్నారు. ప్రతిఏటా ఉగాది రోజున ఈ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని అన్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.  

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...