BRS ఎంపీకి సుప్రీమ్ కోర్ట్ లో ఎదురుదెబ్బ …

-

తెలంగాణ రాష్ట్రానికి చెందిన BRS ఎంపీ బిబి పాటిల్ కు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంగా పిలువబడే సుప్రీమ్ కోర్ట్ భారీ షాక్ ఇచ్చింది. BRS ఎంపీగా బిబి పాటిల్ ను రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోలేదని కె మదన్ మోహన్ రావు అనే వ్యక్తి ఒక పిటిషన్ ను తెలంగాణ హై కోర్ట్ లో వేయడం జరిగింది. ఈ పిటిషన్ పై విచారణకు హై కోర్ట్ ఆదేశాలను జారీ చేసింది. కానీ ఈ లోపు బిబి పాటిల్ తనపై వేసిన పిటిషన్ పట్ల సుప్రీమ్ కోర్ట్ లో ఛాలెంజ్ చేయడానికి పిటిషన్ వేశాడు. కానీ సుప్రీమ్ కోర్ట్ ఈ కేసును పరిశీలించి బి బి పాటిల్ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ పిటిషన్ కేవలం తెలంగాణ హై కోర్ట్ లోనే తేల్చుకోవాలని ఆదేశించింది. దీనితో బి బి పాటిల్ షాక్ తినక తప్పలేదు..

ఇప్పుడు వేరే గత్యంతరం లేక హై కోర్ట్ లో విచారణకు వచ్చే వరకు వెయిట్ చేసి.. విచారణ సమయంలో తగిన విధంగా తమ న్యాయవాదులు వాదించి సమయం కలిసి వస్తే కేసు గెలుస్తారు ? లేదా హై కోర్ట్ లో పిటిషన్ దారుడు తరపున బలంగా ఆధారాలు ఉంటే ఎంపీ గా ఎన్నిక ప్రక్రియను కొట్టివేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news