చిన్న సినిమాలకు హైప్ తీసుకొస్తుంది వీరేనా

-

తెలుగు సినిమా మ్యూజిక్‌ అంటే దేవీశ్రీ… తమన్‌.. కీరవాణి ముందుగా గుర్తుకొస్తారు. అయితే.. ఈ మధ్య వస్తున్న కొత్త పాటలు వింటే ఎవరు కంపోజ్‌ చేశారు? మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరని అడగాల్సివస్తోంది. ఎందుకంటే.. ఆ సినిమాలోని పాటలు అంతగా ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈమధ్య ఓటీటీలో రిలీజైన ఓ సినిమా పాటలతో మ్యూజిక్‌ డైరెక్టర్‌ పేరు వెలిగిపోయింది.

మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌లోని ఈపాట పాడిన గొంతు ఎక్కడో విన్నట్టుంది కదూ. అతని పేరు స్వీకర్ అగస్త్య. సింగర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన స్వీకర్‌ మణిశర్మ మ్యూజిక్‌ డైరెక్షన్‌లో ఎక్కువ పాటలు పాడాడు. ఛలో.. లయన్‌.. లౌక్యం.. దూసుకెళ్తా సినిమాల్లో పాటలు పాడి.. ఆతర్వాత మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

విజయ్‌దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’. వినోద్‌ దర్శకుడిగా పరిచయమయ్యాడు. దొరసాని మూవీతో పరిచయమైన ఆనంద్‌కు పెద్దగా క్రేజ్‌ లేదు. అయితే.. రిలీజ్‌కు ముందు గుంటూరు స్పెషల్‌ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. దీంతో.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ స్వీకర్‌కు గుర్తింపు దక్కింది. మధ్యతరగతి కష్టాలను మెలోడీస్‌గా మార్చిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది.

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌ తమ మ్యూజిక్‌తో చిన్న సినిమాలకు హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. కీరవాణి వారసుడు కాలభైరవ తండ్రి ప్రభావం పడకుండా జాగ్రత్తపడుతూ.. తనకంటూ సొంత ఇమేజ్‌ సంపాదించాడు. బాహుబలి2లో పాడిన దండాలయ్యా సాంగ్‌తో ఇంప్రెస్‌ చేసిన కాలభైరవ మత్తువదలరాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. స్పాట్
కాలభైరవ మ్యూజిక్‌ ఇచ్చిన రెండు సినిమాలూ సక్సెస్‌ అయ్యాయి. మత్తువదలరా తర్వాత రిలీజైన ‘కలర్‌ఫొటో’ ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తరగతి గదిలో అంటూ కాలభైరవ కంపోజ్‌ చేసిన మెలోడీ సాంగ్‌ కలర్‌ఫొటోకు క్రేజ్‌ తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news