ఏపీ టూరిజం రిసార్ట్స్‌లో పాముల హల్‌చల్..!

-

తూ.గో జిల్లా పాసర్లపూడిలోని ఏపీ టూరిజం రిసార్ట్స్‌ లో సర్పాలు బెంబేలెత్తిస్తున్నాయి. రిసార్ట్స్ నదీ తీరంలో ఉన్నందున వరద నీటిలో విష సర్పాలు కొట్టుకు వస్తున్నాయి. దీంతో స్థానికులు భయబ్రాంతులతో బెంబేలెత్తిపోతున్నారు. రిస్టార్ట్స్‌ లోపలికి రోజూ పదుల సంఖ్యలో పాములు వస్తున్నాయి. దీంతో పర్యాటకులు ఉలిక్కిపడుతున్నారు. ఆ రిసార్ట్స్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న గోవింద అనే వ్యక్తి  స్నేక్ క్యాచర్ రాజుకి సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని ఆ పాముని పట్టుకొని మానవ సంచారం లేని చెట్ల పొదలలో వదిలేయడంతో అక్కడ పర్యాటకులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వరద ఉధృతికి ఏజెన్సీ ప్రాంతాల నుంచి  అనేక రకాల పాములు కొట్టుకు వచ్చి ఇళ్లల్లోకి చేరటంతో ఇక్కడ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పర్యాటకులు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news