పెద‌నాన్న డ్రీమ్ కోసం అక్క‌డ విల్లా..?

-

`నాకో డ్రీమ్ వుంది. హాలీవుడ్ స‌మీపంలో ని విల్లాలో ప్ర‌భాస్‌తో క‌లిసి డిన్న‌ర్ చేయాల‌ని. అదే నా కోరిక అంత‌కు మించి మ‌రో కోరిక లేదు. దాన్ని ఫుల్ ఫిల్ చేసుకోవాల‌నుకుంటున్నాను` అని రెబ‌ల్‌స్టార్ కృష్టంరాజు త‌న మ‌న‌సులోని కోరిక‌ని ఇటీవ‌ల మీడియాతో ముచ్చ‌టిస్తున్న సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ఆ కోరిక త్వ‌ర‌లోనే నెర‌వేర‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. `బాహుబ‌లి` సంచ‌ల‌న విజ‌యంతో ప్ర‌భాస్ పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఇదే సినిమాతో ప్ర‌భాస్ స్టార్‌డ‌మ్ కూడా మారింది.

ఒక్క‌సారిగా ప్ర‌భాస్ పాన్ ఇండియా స్థాయి హీరో అయ్యారు. అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్న ప్ర‌భాస్ ఆ గుర్తింపుని మ‌రింత‌గా విస్త‌రించాల‌ని, ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్లో ప్ర‌భాస్ పేరు వినిపించాల‌ని కృష్ణంరాజు క‌ల‌లు కంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌భాస్ అడుగులు వేస్తున్నారు. `బాహుబ‌లి` త‌రువాత `సాహో` చిత్రాన్ని అదే స్థాయిలో డిజైన్ చేసినా క‌థ‌లో ద‌మ్ము లేక‌పోవ‌డంతో ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ పిరియాడిక్ డ్రామా `రాధేశ్యామ్` చిత్రంలో న‌టిస్తున్నాడు ప్ర‌భాస్‌. అయితే ఇది చాల‌ద‌ని భావించాడో ఏమోగానీ వ‌రుస‌గా రెండు పాన్ ఇండియా స్థాయికి మించిన చిత్రాల్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే.

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సి. అశ్వ‌నీద‌త్ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న సైన్స్ ఫిక్ష‌న్ తో పాటు తాజాగా `తన్హాజీ` ఫేమ్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో టి సిరీస్ సంస్ధ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌త‌ల‌పెట్టిన `ఆది పురుష్‌` చిత్రం.  ఈ రెండు చిత్రాల‌తో ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్లో త‌న పేరు మారు మ్రోగాల‌ని ప్లాన్ చేస్తున్నాడు ప్ర‌భాస్. దీనితో పాటు పెద‌నాన్న కృష్ణంరాజు డ్రీమ్‌ని కూడా ఫుల్ ఫిల్ చేసే ప‌నిలో వున్నార‌ట‌. లాస్ ఏంజిల్స్‌లో ఓ విల్లాని త్వ‌ర‌లో కొన‌బోతున్నార‌ట‌. అది ఎప్పుడడు కార్య‌రూపం దాలుస్తుంద‌న్న‌ది మాత్రం త్వ‌ర‌లోనే వెల్ల‌డ‌య్యే అవ‌కాశం వుంద‌ని ప్ర‌భాస్ స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news