పిస్తా పప్పులో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ వృద్ధికి దోహదం చేస్తుంది. ఇది శరీరంలోని ఊపిరితిత్తులకు మరియు ఇతర శరీర అవయవాలకు ప్రాణవాయువును చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది.అలానే శరీరాన్ని దృఢంగా కూడా ఉంచుతుంది. ఇందులో అనేక రకాలైన పోషకాలతో పాటు విటమిన్ b6, బి 9,బి 3, బి 2, బి 1, సాచురేటెడ్,మోనోఅన్సాచురేటెడ్, పాలీ అన్ సాచురేటెడ్ మరియు ఫ్యాట్టి ఆమ్లాలు,ఫైబర్, ఫాస్ఫరస్,కాపర్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్,అమైనో ఆమ్లాలు ఉన్నాయి.
చర్మాన్ని సంరక్షిస్తుంది:
రోజు పిస్తా పప్పును తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్ ఇ ను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలానే చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడుతుంది.
కంటి చూపును మెరుగుపరుస్తుంది :
కంటి సమస్యలతో బాధపడే వారికి పిస్తా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇందులో కెరటోనాయిడ్లు మరియు లూటిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటిలోని కణాలను పునరుద్ధరించి కంటి చూపు స్పష్టంగా ఉండేలా చేస్తాయి.
బరువును తగ్గిస్తుంది :
పిస్తా పప్పులో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్ధాలు బయటకు విసర్జింపబడతాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్లో పిస్తాలు చేర్చుకోవడం ఎంతో మేలును చేస్తుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:
పిస్తాపప్పు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది.అందువల్ల గుండె జబ్బుల సమస్య తగ్గుతాయి. ఇది నరాల వ్యవస్థను బలోపేతం చేసి,గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది :
ఇందులో ఉండే విటమిన్ ఎ మరియు విటమిన్ బి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.అవి శరీరాన్ని అనేక శారీరక రుగ్మతల నుండి దూరం చేస్తుంది. ఇది శరీరంలోని వృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ నుండి రక్షిస్తుంది.ఎముకలను దృఢంగా ఉంచుతుంది.