తెలుగు బిగ్ బాస్ షో: పైమా పై నెగెటివ్ ప్రచారం కొంప ముంచిందా..!!

-

తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది.. ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు.ఇంకో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 ముగియనుంది. ఈ వారంలో గత వారం ఎలిమినేషన్ జోన్లో లాస్ట్ లో ఉన్న ఫైమా కు ఈ వారం ఎలిమినేట్ కాక తప్పలేదు. దీనితో మిగిలిన వారి మీద ఒత్తిడి ఎక్కువ అయ్యింది.

జబర్దస్త్ కామెడీ షో లో ఆకట్టుకున్న పైమా బిగ్ బాస్ లో కూడా జోకులు వేస్తూ ఆకట్టుకుంది . మొదట్లో మంచి ఆట తీరుతో ప్రేక్షకులను అమితంగా అలరించన పైమా తర్వాత రోజుల్లో తన జోరు తగ్గించు కొంది. సీజన్ సీజన్ కు బిగ్ బాస్ జర్నీ లో, క్రమంగా తగ్గుతూ వచ్చింది..గత రెండు మూడు వారాల నుండి అయితే మరింత దారుణంగా ఆమె గ్రాఫ్ పడిపోయింది..ఫలితంగా ఆమె నిన్న ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అదే కాక ఆమె పై సోషల్ మీడియాలో కలర్ షేమింగ్, బాడీ షేమింగ్ బాగా చేసి నెగిటివ్ ప్రచారం చేశారు. ఇది ఎంత మాత్రం బాగాలేదని చాలా మంది భావించారు.

ఇక ఎలిమినేట్ అయిన తరువాత అందరూ ఆమెను ఓదార్చారు. కొంత సేపు బాధ పడ్డా గాని మళ్లీ నార్మల్ అయ్యింది. స్టేజి మీదకి వచ్చాక ఫైమా ఫన్ & ఫ్రస్ట్రేషన్ గేమ్ ఆడిస్తాడు నాగార్జున..ఈ గేమ్ లో ఇంటి సభ్యులందరినీ ఫన్ లిస్ట్ లో వేసి , రేవంత్ ని మాత్రం ఫ్రస్ట్రేషన్ లిస్ట్ లో వేస్తుంది..ఆ తర్వాత రేవంత్ నాగార్జున తో మాట్లాడుతూ ‘సార్..ఫైమా కి చేతి మీద ముద్దు పెడితే అసలు నచ్చదు, ఆమెకు చక్కిలి గింతలు కలుగుతాయని అంటుంది అనే సరికి  నేను ట్రై చేస్తా ఉండు అని నాగార్జున ఫైమా చేతులు పట్టుకుంటే ఆమె వెనక్కి వెనక్కి వెళుతూ ఉంటుంది. ఇక నాగార్జున ఆమె చేతులని లాగిమరీ ముద్దు పెట్టుకుంటాడు. దీనితో ఆమె సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది. తర్వాత అందరికీ బాయ్ చెప్పి వెళ్ళి పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news