ఆ సినిమా నన్ను విపరీతంగా భయపెట్టింది..!!

అడివి శేష్ హీరో గా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్‌ 2’. , మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. నేచురల్ హీరో నాని ఈ సినిమా ను సమర్పించారు. ఈ సినిమా నిన్న శుక్రవారం విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకొని విజయవంతం గా రన్ అవుతోంది.ఈ చిత్రం  విడుదల సందర్బంగా అడివి శేష్‌ పలు అంశాలపై తన అభిప్రాయం పంచుకున్నారు.

మేజర్‌’ సినిమా బయోపిక్‌ కావడం, పైగా ఆర్మీ నేపథ్యంలో ఉండటంతో చాలా భయం వేసింది. నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెడుతున్నారు, సినిమా ప్లాప్ అయితే ఎలా అని మదనపడ్డాను.కాని మహేశ్ బాబు, నమ్రత గార్లు నాకు అండగా నిలిచి దైర్యం చెప్పారు. ఇక ఆ హిట్ అయ్యి మంచి పేరు తీసుకురావడం తో చాలా రిలాక్స్ గా ఫీల్ అయ్యాను.ఇక  ‘హిట్‌ 2’కి ఎలాంటి ఒత్తిడి లేదు. ఆడుతూ పాడుతూ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అన్నారు. థ్రిల్లర్‌ నేపథ్యంలో నేను నటించిన ‘క్షణం’ చిత్రంతో నాకు మంచి పేరు వచ్చింది.

అలాగే ‘గూఢచారి’ నాకు డబ్భులు, పేరు తెచ్చింది. ఆ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో చేయడం వల్ల మేము రిస్క్ లేకుండా ఉన్నాము. అలాగే నాకు నచ్చిన చిత్రాల్లో  చిరంజీవిగారి ‘ఖైదీ’, కార్తీగారి ‘ఖైదీ’ ఉన్నాయి. నేను ఏదయినా సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించినప్పుడు అమ్మ బాగా కోపగించుకొని తిట్టేది. అలాంటి వాటిలో నటించ వద్దని చెప్పేది. కాని నేను. ఫైట్స్, డ్యాన్స్‌లా అది కూడా నటనలో భాగమని అమ్మను కన్విన్స్ చేశాను. ఇప్పటి వరకు సీరియస్ పాత్రలు చేసిన నాకు ఓ మంచి కామెడీ సినిమా చేయాలనుంది అని చెప్పుకొచ్చారు.