Breaking : హిందువులపై అసోం ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

హిందువులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అసోం ఎంపీ, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్. హిందూ పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, ముస్లిం యువకులు 21 ఏళ్లు నిండిన వెంటనే పెళ్లి చేసుకుంటారని… హిందూ పురుషులు ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని, 40 ఏళ్ల వరకు అవివాహితులుగా ఉంటారని వ్యాఖ్యానించారు బద్రుద్దీన్ అజ్మల్. ఇంత ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారని ప్రశ్నించిన బద్రుద్దీన్ అజ్మల్.. హిందువులకు ఈ రోజుల్లో పిల్లలు తక్కువగా ఉండటానికి ఇదే కారణమని చెప్పారు.

Assam MP Badruddin Ajmal's another SHOCKER: 'Hindu men marry late to have  illegal relations' | India News | Zee News

సారవంతమైన భూమిలో విత్తనాలు నాటితే మంచి ఫలితాలను ఆశించవచ్చని అన్నారు. పెళ్లి విషయంలో ముస్లింలు అనుసరించే విధానాన్నే హిందువులు కూడా అనుసరించాలని సూచించారు బద్రుద్దీన్ అజ్మల్. హిందూ బాలికలు 18 నుంచి 20 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంటే వారికి మంచి సంఖ్యలో పిల్లలు పుడతారని అన్నారు బద్రుద్దీన్ అజ్మల్. దీంతో.. ఈ వ్యాఖ్యలపై హిందూ సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.