మాసీ లుక్ లో పవన్ కళ్యాణ్ బైక్ రైడింగ్.. ధర తెలిస్తే షాక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన రాజకీయ, సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఏపీలో రాజకీయ వాతావరణం కూడా పూర్తిగా వేడెక్కింది. ఇటువంటి సమయంలోనే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసిన సరే అది వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు రాజకీయాలలో కూడా పావు కదుపుతూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ రామోజీ ఫిలిం సిటీ లో హరిహర వీరమల్లు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాను త్వరగా పూర్తిచేసి.. సమయం మొత్తం రాజకీయాలకే కేటాయించాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఏ క్షణంలో అయినా సరే రాష్ట్రంలో ఎన్నికలు జరగవచ్చు అంటూ వైసీపీ సిగ్నల్స్ ఇస్తోంది. రాజకీయ వ్యవహారాల వల్ల ఇప్పటికే ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే బస్సు యాత్ర చేపట్టాల్సి ఉంది. అందుకే యాత్ర ప్రారంభమయ్యే లోపు సాధ్యమైనంత వరకు సినిమా షూటింగ్ పూర్తి చేయాలనే పట్టుదలతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్.. “BMW R1250 GS” మోడల్ బైక్ వేసుకొని రామోజీ ఫిలిం సిటీ లో తిరుగుతున్న వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే ఈ వీడియో వైరల్ కావడంతోపాటు..” వేగం నడిపే ఇంజన్లో ఉండదు మిత్రమా .. నడిపే వాడి నరాల్లో ఉంటుంది..” అని గోపాల గోపాల సినిమాలోని డైలాగును కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు గుర్తు చేస్తున్నారు.

అయితే ఈ బైకు అందరినీ అట్రాక్ట్ చేయడమే కాకుండా దీని ఖరీదు ఎంత ఉంటుందని ప్రతి ఒక్కరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ బైక్ ఖరీదు అక్షరాల రూ. 24 లక్షలు ఉంటుందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. మాసీ లుక్కులో పవన్ కళ్యాణ్ బైక్ రైడింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.