క్రీడా రంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఫుట్బాల్ దిగ్గజం పీలే (82) మృతి చెందాడు. కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను పరిస్థితి విషమించడంతో కన్నుమూశారని కూతురు ప్రకటించింది.
అతను బ్రెజిల్ కు మూడుసార్లు (1958, 1962, 1970) ప్రపంచ కప్ అందించారు. పీలే బ్రెజిల్ తరపున 92 అంతర్జాతీయ మ్యాచ్లలో 77 గోల్స్ చేశారు. మొత్తం 1,363 మ్యాచ్లలో 1,281 గోల్స్ చేశారు. 2000 లో ‘ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ’గా ఎంపికయ్యారు.