ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీకి మాతృ వియోగం కలిగింది.ప్ర ధాని నరేంద్ర మోదీ తల్లి హిరాబెన్ ( 100) ఇక లేరు. వందేళ్ళ వయసు ఆమే అహ్మదాబాద్ నివాసంలో రెం డు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. యూ ఎన్ మెహతా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. వయో సంబంధ సమస్యలతో చికిత్స ఫలించకపోవడంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.
ఈ ఏడాది జూన్ లోనే హిరాబెన్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఇక ఇవాళ ఆమె మరణించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 100 ఏళ్లు పూర్తి చేసుకుని, ఈశ్వరిని చెంతకు చేరిందన్నారు మోడీ. మహిమాన్వితమైన శతాబ్ది భగవంతుని పాదాల చెంత ఉంది… మాలో నేను ఎప్పుడూ త్రిమూర్తులు, ఒక సన్యాసి ప్రయాణం, నిస్వార్థ కర్మ యోగి యొక్క చిహ్నం మరియు విలువలకు కట్టుబడి ఉండే జీవితాన్ని కలిగి ఉన్నాడని నేను ఎప్పుడూ భావించాను అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम… मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022