గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలి : డిప్యూటీ సీఎం పవన్

-

గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. విజయవాడ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా అందుతున్న తీరుతెన్నులను అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగం అధికారులతోనూ మంత్రి సమీక్ష జరిపారు. సోషల్ ఆడిట్ ప్రక్రియపై సుమారు రెండున్నర గంటల సేపు కూలంకషంగా చర్చించారు.

 

ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, నిధుల దుర్వినియోగం జరిగితే గుర్తించే పద్ధతిని అధికారులు మంత్రికి వివరించారు. ఉపాధి హామీ పథకంలో నిధులను సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని, ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్‌ తెలిపారు. సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని, గ్రామాల్లో సోషల్ ఆడిట్ సభలు ప్రొటోకాల్‌ను అనుసరించి ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాలని ,అలాగే ఉపాధి హామీ నిధులు ఏ మాత్రం దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పక్కాగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news