TV9 రజనీకాంత్‌పై వదంతులు.. ఆ ఛానెళ్లకు లీగల్ నోటీసులు

-

టీవీ9 రజినీకాంత్‌కు ఐటీ నోటీసులు వచ్చాయంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే ఖండించారు. మరోవైపు తాజాగా ఈ వ్యవహారంపై ఆయన చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. రజినీకాంత్‌కు ఐటీ నోటీసులు అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లపై 469,505 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఏం జరిగిందంటే? : “ఇన్నాళ్లు అటు తెలంగాణలో కేటీఆర్ నుంచి ఇటు ఏపీలో జగన్ నుంచి అడ్డంగా దోచుకున్న రజినీకాంత్‌కు ఐటీ శాఖ నోటీసులు పంపింది. కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక జర్నలిస్టుగా రికార్డుల్లోకి ఎక్కిన రజినీకాంత్ ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు నోటీసులు పంపారు. ఇటీవల దిల్లీలో ఉన్న కూతుర్ని కలిసేందుకు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్లిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు గుర్తు తెలియని వ్యక్తులు ఐటీకి పంపారు. ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయడం అనేది ఐటీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ” అనే వదంతులు నెట్టింట వైరల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news