ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి కార్యాలయంలో సహాయ సహకారాలు అందడం లేదా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. పాపం నిమ్మగడ్డ తో ఎవరూ కూడా ఆఫీస్ లో మాట్లాడటం లేదు అని టాక్. ఆయన నిన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయనతో అసలు ఎవరూ మాట్లాడ లేదు అని, ఆఫీస్ లోకి వెళ్ళగానే ఇతర అధికారులు కూడా అసలు ఆయన దగ్గరకు రాలేదు అంటున్నారు.
కేవలం ఆఫీస్ స్టాఫ్ మినహా ఎవరూ ఆయన దగ్గరకు ఎవరూ రాలేదట. ఆయన స్వయంగా మాట్లాడే ప్రయత్నం చేసినా సరే ఎవరూ మాట్లాడలేదు అని టాక్. ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురవుతాము ఏమో అనే భయం వారిలో ఉంది అని, అందుకే ఆయనతో సామాజిక దూరం పాటిస్తున్నారు అని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఆయనతో ఆఫీస్ లో చాలా మంది… అధికారిక దూరం పాటిస్తున్నారట మరి.