ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్యలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అయోధ్యను పూర్తిగా రక్షణ వలయంలోకి తీసుకున్నారు. అయోధ్యకు టెర్రరిస్టుల ముప్పు పొంచి ఉందనే నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. మోదీ రాక నేపథ్యంలో అయోధ్యలో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ రోజున మోదీ అయోధ్యలో 3 గంటల పాటు గడపనున్నారు. ఇక మోదీ అయోధ్య పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
* ప్రధాని మోదీ ఉదయం 9.35 గంటలకు న్యూఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు బయల్దేరుతారు. ఉదయం 10.35 వరకు లక్నోలో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి 10.40 గంటలకు అయోధ్యకు బయల్దేరుతారు. అయోధ్యలో ఉదయం 11.30 గంటలకు మోదీ ప్రత్యేక హెలికాప్టర్‌లో ల్యాండ్ అవుతారు. అయోధ్యలోని సాకేత్ కాలేజీలో అందుకు కొత్తగా హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.
* అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ అక్కడి హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఉదయం 11.40 గంటలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి మోదీ హనుమాన్ గర్హీలో 10 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత భూమిపూజకు వెళ్తారు.
* మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ, సీఎం యోగి ఇద్దరూ రామ జన్మభూమి కాంప్లెక్స్‌లోని రామ్ లల్లా విరాజ్‌మాన్‌ను దర్శించుకుని 10 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత 12.15 గంటలకు మోదీ ఆలయ ఆవరణలో పారిజాత మొక్కను నాటుతారు.
* మధ్యాహ్నం 12.30 గంటలకు భూమి పూజ జరుగుతుంది. 12.40 గంటలకు అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
* మధ్యాహ్నం 2.05 గంటలకు మోదీ తిరిగి సాకేత్ కాలేజీ హెలిప్యాడ్‌కు వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 2.20 గంటల వరకు లక్నో చేరుకుంటారు. అక్కడ 3 గంటల పాటు సరయూ నది తీరం, ఇతర ఆలయాలను మోదీ సందర్శిస్తారు. అనంతరం తిరిగి న్యూఢిల్లీకి వెళ్లిపోతారు.
కాగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ చెబుతున్న ప్రకారం.. ఈ కార్యక్రమానికి మొత్తం 175 మంది అతిథులు వస్తారు. వీరిలో 135 మంది అతిథులు ఆధ్యాత్మిక వేత్తలుగా ఉన్నారు. ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామ మందిర నిర్మాణ డిజైన్‌తో ప్రత్యేక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయనుంది.