కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎవరూ కూడా బయటకు రావొద్దని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయినా సరే చాలా మంది మాట వినే పరిస్థితిలో లేరు అనే విషయం అర్ధమవుతుంది. తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం, నటుడు విక్కీ కౌషల్ ఒక వీడియోను పంచుకున్నారు.
దీనిలో ఒబెరాయ్ స్ప్రింగ్స్ నివాసితులు అందరూ కూడా భారీ చప్పట్ల మధ్య కరోనావైరస్ నుంచి కోలుకున్న అమ్మాయి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. వీడియోను పంచుకుంటూ, “దిగులుగా ఉన్న రోజున సూర్యరశ్మి కిరణం వలె, మా చిన్న యోధుడు ఇంటికి తిరిగి వస్తాడు! #WelcomeBackChamp” అని పోస్ట్ చేసాడు ఆయన. ఈ ప్రాంతం పలువురు బాలీవుడ్ నటులకు నివాస ప్రాంతంగా ఉంది.
రాజ్‌కుమార్ రావు మరియు పట్రాలేఖా, విపుల్ షా, కృష్ణ అభిషేక్, కాశ్మీరా షా, అహ్మద్ ఖాన్, చిత్రంగడ సింగ్, చాహత్ ఖన్నా, సప్నా ముఖర్జీ, నీల్ నితిన్ ముఖేష్ మరియు అనేకమంది బాలీవుడ్ ప్రముఖులకు నిలయం.అయితే విక్కీ లాక్ డౌన్ ని లెక్క చేయకుండా బయటకు వెళ్ళాడని సోషల్ మీడియాలో జనం క్లాస్ తీసుకున్నారు. తనకు పోలీసులు కూడా క్లాస్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన అతను నేను లాక్ డౌన్ ఉల్లంఘించలేదు అని స్పష్టం చేసాడు. అవి కేవలం పుకార్లు అని కొట్టిపారేశాడు.