టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. సినిమాల్లో తాను చేసే పాత్రల దృష్ట్యా తనను తప్పక చూస్తున్నారని కానీ తన జీవితంలో ఎన్నో కష్టాలు పడి నిలబడ్డానంటూ చెప్పకు వచ్చారు…
నటి కరాటే కళ్యాణి ఎప్పటికప్పుడు పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఆమెకు ఫైర్ బ్రాండ్ అని పేరు కూడా ఉంది తన కెరీర్లో చేసినవి తక్కువ సినిమాలో అయినప్పటికీ కొన్ని రకాల గొడవలతో వార్తలు నిలుస్తూ వస్తున్నారు అయితే సమాధానం ఎప్పుడో తప్పుదృష్టతోనే చూస్తుందని తన జీవితం కోసం ఎవరికీ తెలియదని ఎమోషనల్ అయ్యారు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరాటే కళ్యాణి.. “వైవాహిక జీవితంలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. తాగుబోతు భర్త నరకం చూపించాడు. తిట్టడం, కొట్టడం చేశాడు. అయినా భర్త కాబట్టి భరించాను. అర్ధరాత్రి తాగొచ్చి వండి పెట్టమంటే చేశాను. వివాహ బంధాన్ని ఎంతగా మలుచుకోవాలి అనుకున్న జరగలేదు ఇంకా చేసేది ఏమీ లేక విడాకులు తీసుకున్నాను అమ్మ మరో పెళ్లి చేసుకోమని అంటుంది వంటరిగా ఎలా ఉంటావు అని చెప్తూ వస్తుంది నాన్న చనిపోయాక అమ్మ తమ్ముడితో కలిసి ఉంటున్నాను.. తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు నేను చనిపోతే నువ్వు ఏమైపోతావో తమ్ముడు ఇంకా పెళ్లి చేసుకొని బాగానే ఉంటాడు నువ్వు పెళ్లి చేసుకో సంబంధాలు చూస్తాము అంటుంది నిజంగా నన్ను ఇష్టపడి వచ్చేవాడు అయితే పెళ్లి చేసుకుంటా… అయితే కొన్ని సందర్భాల్లో జనాలు మాటలు నన్ను ఎంతగానో బాధపెడుతూ ఉంటాయి సినిమాల్లో నేను చేసే పాత్రలు చూసి నన్ను సమాజం వ్యభిచారిగా చూస్తుంది. నిజానికి నేను అలంటి దాన్ని కాదు. ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. నా వెనుక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఈజీగా మాటలు అనేస్తారు. అలాగే నేను కష్టపడి పైకి వచ్చాను. నన్ను నేనే పోషించుకోలేని స్థాయి నుండి ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదిగాను. కానీ సమాజం సూటి పోటి మాటలు విన్నప్పుడు చాలా బాధేస్తుంది. ఒంటరిని అనే భావన కలుగుతుంది… ” అంటూ ఎమోషనల్ అయ్యారు