కొత్త సంవత్సరం ఆనందంగా మొదలు పెట్టారా..? ఈ ఏడాది అంతా ఆర్ధిక బాధలేమి లేకుండా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే కొత్త సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కచ్చితంగా ఇవి పాటించండి. మరి ఇక పూర్తి వివరాలని చూసేద్దాం.
సేవింగ్స్ ముఖ్యం
చాలా మంది ఎక్కువగా ఖర్చు చేస్తూ వుంటారు. కానీ ఖర్చు చేసే ముందు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఖర్చు చేసే ముందు సేవింగ్స్ ముఖ్యం. కాబట్టి సేవ్ చెయ్యడానికి చూడండి. మొదటి నెల జనవరి నుంచే మీ ఆదాయం లో నుండి కొంత సేవ్ చెయ్యండి. పూర్తిగా ఖర్చు చేసేయకుండా మీ ఆదాయం లో కొంత డబ్బుని దాచడం స్టార్ట్ చేస్తే అవసరాలకి వాటిని తీసుకు ఖర్చు చేసుకోవచ్చు.
పే లేటర్ విధానం వద్దు
చాలా మంది తరవాత కట్టచ్చు కదా అని ముందు కొనేస్తూ వుంటారు. ఎప్పుడు ఆ తప్పు చెయ్యద్దు. కొత్త సంవత్సరం లో అత్యవసరం అయితే తప్ప ఇలాంటివి కొనకండి.
ఎమర్జెన్సీ ఫండ్
ఎమర్జెన్సీ ఫండ్ అనేది ముఖ్యం. అత్యవసరాల కోసం కొంత డబ్బు పక్కన ఉంచుకోవాలి. దీన్ని మీరు అస్సలు లైట్ తీసుకోవద్దు. ఒకవేళ సరైన టైం కి జీతం పడకపోయినా సరే ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. దాన్ని వాడుకోవచ్చు.
ప్రకటనల తో మోసపోవద్దు
చాలా మంది ప్రకటనల తో మోసపోతుంటారు. ఆ తప్పు ని చెయ్యకండి.