Sohel: అదరగొడుతున్న సోహెల్..‘బూట్ కట్ బాలరాజు’లో లుక్ అదిరింది

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ ఆ తర్వాత కాలంలో సిల్వర్ స్క్రీన్ పైన ఎంట్రీ ఇచ్చి లైఫ్ మార్చుకున్నారు. సీజన్ ఫోర్ కంటెస్టెంట్ సోహెల్.. ప్రజెంట్ జోరు మీదున్నారు. ఇప్పటికే హీరోగా రెండు సినిమాలు కంప్లీట్ చేసిన సోహెల్..సోమవారం మరో సినిమా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

అలనాటి స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో ‘ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు’ అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో నట కిరటీ రాజేంద్రప్రసాద్, సోహెల్ ప్రధాన పాత్రలు పోషిస్తు్న్నారు. కాగా, ఈ సింగరేణి యువకుడు నటించిన ‘మిస్టర్ ప్రగ్నెంట్, బూట్ కట్ బాలరాజు’ సినిమాలు షూట్ కంప్లీట్ చేసుకున్నాయి.

సోమవారం సోహెల్ బర్త్ డే సందర్భంగా ‘బూట్ కట్ బాలరాజు’ మూవీ యూనిట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఇందులో అనన్య నాగళ్ల హీరోయిన్ కాగా, లక్కీ మీడియా – గ్లోబల్ ఫిలిమ్స్ బ్యానర్స్‌ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కోనేటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్టోరి ఉన్నట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది.

ట్రైలర్ లో విలేజ్ యువకుడిగా సోహెల్ బూట్ కట్ ప్యాంట్ తో అదరగొట్టాడు. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ కు కూడా ప్రయారిటీ ఇచ్చినట్లున్నారు. ఫేమస్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, భీమ్స్ మ్యూజిక్ ఇస్తున్నారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్. త్వరలో ఈ మూవీ అప్ డేట్స్ ఇవ్వనున్నట్లు మూవీ యూనిట్ సభ్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news