మ‌న్మ‌థుడు-2కి రిపేర్లు త‌ప్ప‌వా?

416

ఇత‌రులు గురించి నీతులు చెప్పే చిన్మ‌యి శ్రీ పాద భ‌ర్తే సినిమాకు ద‌ర్శ‌కుడు కావ‌డంతో మ‌రింత అగ్గి రాజేసిన‌ట్లు అయింది. ఈ నేప‌థ్యంలో యూనిట్ ఆలోచ‌నలో ప‌డిన‌ట్లు ఓ వార్త లీకైంది.

కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌న్మ‌థుడు-2 చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమా ప్రోమోల‌ను, టీజ‌ర్ల‌ను రిలీజ్ చేసింది. అయితే ఇందులో కొన్ని స‌న్నివేశాల్లో అడ‌ల్ట్ కంటెంట్ గ‌ట్టిగానే ఉంద‌ని విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి. హీరోయిన్ టాప్ ఓపెన్ చేయ‌డం….నిక్క‌రు స‌న్నివేశాల్లో క‌నిపించ‌డం…హీరోకి హీరోయిన్ ఏ సినిమా చూపిస్తాన‌న‌డం వంటి డైలాగులు కాస్త ఇబ్బంది క‌రంగానే మారాయి. దీంతో నాగ్ సినిమాలో ఇంత అస‌భ్య‌త అంటూ అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వ‌య‌సులో నాగార్జున‌కు హీరోయిన్ తో రొమాన్స్ అవ‌స‌ర‌మా? అంటూ క్రిటిక్ వ‌ర్గం సైతం గ‌ట్టిగానే ప్ర‌శ్నిస్తోంది.

పైగా ఇత‌రులు గురించి నీతులు చెప్పే చిన్మ‌యి శ్రీ పాద భ‌ర్తే సినిమాకు ద‌ర్శ‌కుడు కావ‌డంతో మ‌రింత అగ్గి రాజేసిన‌ట్లు అయింది. ఈ నేప‌థ్యంలో యూనిట్ ఆలోచ‌న లో ప‌డిన‌ట్లు ఓ వార్త లీకైంది. గ‌తంలో నాగ్ సినిమాల్లో రొమాంటిక్ స‌న్నివేశాలుండేవి. కానీ కాల‌క్ర‌మేణా వాటిని కింగ్ త‌గ్గించుకుంటూ వ‌చ్చారు. క‌థ ఆధారంగా క‌మిట్ అయ్యారు త‌ప్ప‌! అశ్లీల‌త‌కు చోటివ్వ‌లేదు. కానీ మ‌న్మ‌ధుడు-2లో అలాంటివి ఫుల్ మూవీ లో చాలా స‌న్నివేశాలే ఉండే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తోంది. ఈ నేప‌త్యంలో యూనిట్ ఆలోచ‌న‌లో ప‌డి వాటిలో మార్పులు చేయాల‌ని చూస్తున్నట్లు వినిపిస్తోంది. డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌కు మ్యూట్ వేసినా స‌న్నివేశాల‌ను మాత్రం మ్యూట్ చేయ‌డానికి ఆస్కారం లేదు.

అందుకు ప్ర‌త్యామ్నాయం వెత‌కాలి. కాబ‌ట్టి సీన్ సింకింగ్ అంటే కచ్చితంగా రీ షూట్ కు వెళ్లాల్సిందే. విమ‌ర్శ‌లు రావ‌డానికి ఆస్కారం ఉన్న స‌న్నివేశాల‌న్నింటినీ రీ షూట్ చేస్తేనే బెటర్ అని ఆలోచ‌న చేస్తున్నారుట‌. ప్ర‌స్తుతం వ‌స్తోన్న ఫీడ్ బ్యాక్ పై నాగ్ కూడా చాలా అసంతృప్తిగా ఉన్న‌ట్లు స‌మాచారం. దీనిపై చివ‌రి నిర్ణ‌యం నాగ్ చేతుల్లోనే ఉంటుంది కాబ‌ట్టి ద‌ర్శ‌కుడు ఆయ‌న చెప్పిన‌ట్లు న‌డుచుకోవాల్సిందే. మ‌రి ఫైన‌ల్ గా ఏం జ‌రుగుతుందో చూద్దాం.