80 ఏళ్ల వృద్ధురాలిపై 15 ఏళ్ల కుర్రాడు అత్యాచారయత్నం

333

కోపంతో రగిలిపోయిన బామ్మ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆ బాలుడిని తీవ్రంగా కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పజెప్పారు. బాలుడిని జువైనల్ హోంకు తరలించారు.

80 ఏళ్ల వృద్ధురాలిపై 15 ఏళ్ల వయసు ఉన్న కుర్రాడు అత్యాచారయత్నం చేయడం బీహార్‌లో కలకలం సృష్టించింది. మధుబని జిల్లాలోని జమాలియా గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో ఆమె వద్దకు చేరుకున్న 15 ఏళ్ల కుర్రాడు.. ఆమె మీద అత్యాచారయత్నం చేశాడు.

బామ్మ అరవకుండా ఆమె నోట్లో బట్టలు కుక్కి అత్యాచారం చేయబోగా.. ఆమె నోట్లో నుంచి బట్టలు తీసి గట్టిగా అరవడంతో ఇంట్లో ఉన్నవాళ్లంతా లేచి నిందితుడిని రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు.

కోపంతో రగిలిపోయిన బామ్మ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆ బాలుడిని తీవ్రంగా కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పజెప్పారు. బాలుడిని జువైనల్ హోంకు తరలించారు.