ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ లలో ఫేస్బుక్ ఒకటి. ఇంటర్నెట్ వినియోగించే చాలామందికి ఫేస్ బుక్ లో ఖాతా ఉంది. ప్రస్తుతం అందరూ ఈ ఫ్లాట్ ఫామ్ ను ఉపయోగిస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించే వారు కూడా అనేకం. ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం కూడా అధికంగానే ఉంటుంది. అయితే ఇటీవల ఫేస్బుక్ యూజర్ల సంఖ్య పెరుగుతున్నకొద్దీ.. హ్యాకర్లు కూడా పెరుగుతూనే ఉన్నారు.
తమ ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేయడం ద్వారా యూజర్ల డేటాను కూడా దుర్వినియోగం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫేస్బుక్ అకౌంట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ప్రధాని పర్యటనకు రెండు రోజుల ముందే ఖాతా సేవలు స్తంభించాయి. హ్యాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యక్తిగతంగా అవహేళనకు గురి చేసే విధంగా రాతలు రాస్తున్నారు. దీనిపై ఓ నివేదిక రూపంలో సైబర్ క్రైమ్ పోలీసులకు బిజెపి నాయకులు ఫిర్యాదు చేయనున్నారు.