కొడుకు ఆస్ట్రేలియాలో తల్లి రోడ్డు మీద…!

-

కరోనా కష్టాల గురించి ఎంత చెప్పినా ఏ విధంగా చెప్పినా సరే తక్కువే అవుతుంది. తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక ఇబ్బంది పడే వారు కొందరు. అన్నీ ఉండి కూడా వ్యాపారాలు నష్టపోయి నానా ఇబ్బందులు పడుతున్న వారు మరి కొందరు. ఎవరు ఎవరూ కూడా ఇప్పుడు ఆధుకోలేని పరిస్థితి. కేంద్రాలు ప్యాకేజి ఇచ్చినా సరే అది క్షేత్ర స్థాయిలో అందే సూచనలు ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు.

ఇక ఇది పక్కన పెడితే తాజాగా ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. పేరు రామతులసమ్మ.. కర్నూలు పట్టణంలోని వెంగన్నబాయి ప్రాంతం లో ఉంటారు. భర్త 30 ఏళ్ళ క్రితం చనిపోగా ఉన్న కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. కోడలు సరిగా చూడకపోవడంతో తల్లిని ఎవరు చూసే వారు లేకపోవడంతో వెంటనే ఆమెను తీసుకుని వెళ్లి కర్నూలులో ఉన్న ఒక ఆశ్రమంలో జాయిన్ చేసాడు.

కరోనా దెబ్బకు ఆ ఆశ్రమం కాస్త మూతపడింది. దీనితో వ్రుద్దురాలిని ఆదుకునే వారు ఎవరూ కూడా లేకపోయారు. కర్నూలు నుంచి ఆమె రెండు రోజుల క్రితం బస్సులో ప్రయాణించి డోన్‌ కొత్తబస్టాండుకు వచ్చింది. ఆమెను చూసిన అక్కడి స్థానికులు వివరాలు అడిగారు. అప్పటికే ఆమె ఆకలితో బాగా ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో ఆమెను వైఎస్‌ నగర్‌లోని హోసన్న వృద్ధాశ్రమానికి తీసుకుని వెళ్ళారు.

Read more RELATED
Recommended to you

Latest news