కన్నతండ్రిని కసాయి కొడుకు కిరాతకంగా చంపేసి సొంత పొలంలో పాతిపెట్టిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం చేవెళ్ల గుండాల గ్రామంలో చోటు చేసుకుంది. నెల రోజులుగా తండ్రి కనిపించకపోవడంతో బంధువులు కొడుకుని గట్టిగా నిలదీయడంతో దారుణం వెలుగుచూసింది. తండ్రిని తానే తల్లితో కలసి హత్య చేసినట్లు చెప్పడంతో షాక్‌కి గురయ్యారు. నెల రోజులుగా కిష్టయ్య కనిపించకుండా పోయారు. బంధువులు గాలించినా ప్రయోజనం లేకపోయింది.
చివరికి కిష్టయ్య కొడుకుపై అనుమానం వచ్చిన బంధువులు అతన్ని ప్రశ్నించడంతో దారుణం బయటపడింది. తానే తల్లితో కలసి తండ్రిని చంపేశానని.. శవాన్ని తమ పొలంలోనే పాతిపెట్టినట్లు అంగీకరించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహం బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు హత్యకు గల కారణాలు ఏమిటనే విషయం తెలుసుకునే పనిలో పడ్డారు. ఇక హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది