కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 79 వ ఫౌండేషన్ డే లో కేంద్ర మంత్రి పీపీఈ కిట్లు ఉత్పత్తి గురించి తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో 5 లక్షలకు పైగా పీపీఈ కిట్లు ఉత్పత్తి 110 మంది చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఇక గతంలో కొన్ని రాష్ట్రాలు పీపీఈ కిట్లు లేవు అని ఫిర్యాదు చేసినవారికి ఇప్పుడు పంపుతాము అంటే వద్దు అని చెబుతున్నట్లు అని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ కోసం 7కోట్ల పరీక్షలు నిర్వహించామని… అలాగే రికవరీ రేటు కూడా చాలా మెరుగు పడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
కరోనా వైరస్ ప్రారంభం అయినప్పటి రికవరీ రేటు 12 శాతంగా ఉండగా, ప్రస్తుతం 82 శాతానికి చేరుకుంది అని.. అంతేకాకుండా కోవిడ్ మరణాల రేటు 1.6 శాతంగా ఉంది అని మంత్రి తెలియజేశారు. ఇక ప్రస్తుతం భారతదేశంలో 1823 కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఇప్పటి వరకు దేశంలో ఏడు కోట్ల పరీక్షలు నిర్వహించగా.. గత కొద్దీ రోజులుగా ప్రతి రోజు 13-15 లక్షల కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.