ఆచార్య లో నేను కూడా ఉన్నా : సోను సూద్

-

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగి పోతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమా హీరోయిన్, విలన్, ముఖ్య పాత్రల విషయంలో కూడా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆచార్య సినిమాలో నటుడు సోను సూద్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా టాలీవుడ్ టౌన్ లో టాక్ వినిపిస్తుంది.

అయితే ఆచార్య సినిమాలో సోనుసూద్ కీలకపాత్రలో నటించబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన సోనూ సూద్ క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు సోనుసూద్. తన పాత్రకు సంబంధించి కొంతవరకు షూటింగ్ కూడా పూర్తయిందని.. సెకండ్ షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉంది అంటూ స్పష్టం చేశారు. ఈ సినిమాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాత్రలో నటిస్తున్నాను అంటూ తెలిపిన సోనూసూద్ ఆ పాత్రకు సంబంధించిన వివరాలు మాత్రం చెప్పలేదు. ఆచార్య సినిమా కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు సోనుసూద్.

Read more RELATED
Recommended to you

Latest news