కరోనా వైరస్ చికిత్సలో భాగంగా పావిపిరావిర్ అనే ఔషధాన్ని భారత్ లో విక్రయించేందుకు హెటేరో డ్రగ్స్ గత కొన్ని రోజుల క్రితం అనుమతి పొందిన విషయం తెలిసిందే. ప్రాథమిక మధ్యస్థ దశలో ఉన్నప్పుడు కరోనా వైరస్ కు ఈ వ్యాక్సిన్ అందించేందుకు వైద్యులు కూడా ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. మాత్రల రూపంలో నోటి ద్వారా తీసుకునే కరోనా ఔషధం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా మందుల దుకాణాల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రజలందరికీ కాస్త ఉపశమనం లభించింది అని చెప్పాలి.
అయితే దేశ వ్యాప్తంగా మందుల దుకాణాలు ఫార్మసీ లలో లభ్యమవుతున్నప్పటికీ కేవలం డాక్టర్ ప్రిస్కిప్షన్ మేరకు మాత్రమే ఈ ఔషధాన్ని అందించేలా నిబంధన విధించింది ప్రభుత్వం. ఒక మాత్ర విలువ 59 రూపాయలుగా సంస్థ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో… కరోనా కేసుల సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.