విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్‌

విజయవాడ దుర్గమ్మ ను బాలీవుడ్‌ స్టార్‌, ఆపాన్న హస్తుడు సోనూసూద్‌ ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలను రియల్‌ హీరో సోనూ సూద్‌ కు అంద జేశారు ఆలయ అధికారులు. ఇక అమ్మ వారిని దర్శించుకున్న అనంతరం… మీడియా తో సోనూ సూద్‌ మాట్లాడారు.
విజయ వాడ దుర్గమ్మ ను దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని సోనూ సూద్‌ తెలిపారు.

కరోనా మహమ్మారి కారణం గా ఎంతో మంది ప్రజలు అనేక రకాలైన ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు సోనూ సూద్. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, అందరినీ చల్లగా కాపాడాలని బెజవాడ దుర్గమ్మ ను కోరుకున్నానని స్పష్టం చేశారు సోనూ సూద్. కరోనా మహమ్మారి పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సోనూసూద్‌ సూచనలు చేశారు. కాగా.. కరోనా ఫస్ట్‌ వేవ్‌ మరియు సెకండ్‌ వేవ్‌ సమయంలో…చాలా మంది నిరు పేదలకు సోనూసూద్‌ ఆర్థిక సహాయం చేసిన సంగతి తెలిసిందే.