బాలీవుడ్ స్టార్ నటుడు, హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పంజాబ్ రాష్ట్ర ఐకాన్ – ఎన్నికల సంఘం ప్రచార కర్త పదవి నుంచి తప్పుకున్నాడు సోనూసూద్. ఈ మేరకు శుక్రవారం రాత్రి తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు సోనూ సూద్.
”అన్ని మంచి విషయాల్లాగే.. ఈ ప్రయాణం కూడా ముగిసింది. పంజాబ్ రాష్ట్ర చిహ్నంగా నేనను స్వచ్ఛందంగా వైదొలిగాను. త్వరలో రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో నా కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న నేపథ్యంలో.. నేను, ఈసీ పరిస్పరం ఈ నిర్ణయం తీసుకున్నాము. ” అంటూ సోనూసూద్ స్పష్టం చేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో.. సోనూసూద్ చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలను నిరాటకంగా కొనసాగిస్తున్నారు సోనూ సూద్.
ఈ నేపథ్యంలో ఆయన సొంత రాష్ట్రమైన పంజాబ్ లో సోనూసూద్ కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఆయనను పంజాబ్ లో సోనూసూద్ కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఆయనను పంజాబ్ స్టేట్ ఐకాన్ గా పేర్కొంటూ ఎన్నికల సంఘం తరఫున ప్రచారకర్తగా నియమించింది ఈసీ.