ఇండియాలో 3071కి చేరిన ఓమిక్రాన్ కేసులు… మహారాష్ట్ర, ఢిల్లీల్లోనే సగం కేసులు

-

ప్రపంచాన్ని ఓమిక్రాన్ చుట్టుముడుతోంది. అత్యంత వేగంతో ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రోజరోజుకు పెరుగుతోంది. ఇండియాలో కూడా ఓమిక్రాన్ తీవ్రత ఎక్కువగానే ఉంది. అత్యంత వేగంతో విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇండియాలో ఇప్పటి వరకు 3071 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని 27 రాష్ట్రాలు/యూటీల్లో ఓమిక్రాన్ కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు ఓమిక్రాన్ నుంచి 1203 మంది రికవరీ అయ్యారు.

దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడే సగం కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 876 ఓమిక్రాన్ కేసులు రాగా… ఢిల్లీలో 513 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 333 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజుకు లక్షను దాటింది. అయితే ఈ కేసులన్నింటిలో కూడా ఎక్కువగా ఓమిక్రాన్ కేసులే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఓమిక్రాన్ సోకిన వారు త్వరగా కోలుకుంటుండటం… ఎక్కువగా అత్యవసర చికిత్స అవసరం రాకపోతుండటం కాస్త ఉపశమనం కలిగించే విషయం.

Read more RELATED
Recommended to you

Latest news