ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇక తన డివైస్‌లను భారత్‌లోనే ఉత్పత్తి చేయనుంది. ఈ మేరకు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగానే తాము రానున్న కాలంలో భారత్‌లో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నామని, అందుకనే తమ డివైస్‌లను ఇక్కడ ఉత్పత్తి చేస్తామని అమెజాన్ ఇండియా కంట్రీ లీడర్, గ్లోబల్ ఎస్‌వీపీ అమిత్ అగర్వాల్ తెలిపారు.
అమెజాన్ ప్రస్తుతం ఇకో, ఫైర్ స్టిక్ వంటి డివైస్‌లను ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. అయితే ఆరంభంలో మన దేశంలో ఫైర్ టీవీ స్టిక్‌లను ఉత్పత్తి చేస్తారు. ఇందుకు గాను చెన్నైలోని ఫాక్స్‌కాన్ అనే సంస్థకు చెందిన సబ్సిడియరీ సంస్థ క్లౌడ్ నెట్‌వర్క్ టెక్నాలజీలో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో అక్కడ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌లను ఉత్పత్తి చేస్తారు.
ఫైర్ టీవీ స్టిక్‌లకు భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. గూగుల్ క్రోమ్‌క్యాస్ట్‌కు దీటుగా ఈ డివైస్‌ను వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే దీన్ని భారత్‌లో తయారు చేస్తే దిగుమతి సుంకం ఉండదు కనుక ఈ డివైస్‌ల ధరలు త్వరలో తగ్గేందుకు అవకాశం ఉంటుంది.