అతడు క్రికెట్ ఆడినంత కాలం అంతే..!?

ఐపీఎల్ సీజన్ లో ఏబీ డివిలియర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఎబి డివిలియర్స్ బాగా రాణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఎబి డివిలియర్స్ సౌత్ ఆఫ్రికా జట్టులో స్థానం సంపాదించుకో బోతున్నాడు అన్న చర్చ మొదలయింది. గతంలో రిటైర్మెంట్ ప్రకటించి మరోసారి పునరాలోచించి తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న ఎబి డివిలియర్స్ గత ఏడాది వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించుకుంటాడు అని అనుకున్నప్పటికీ అది కుదరలేదు…

ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించడంతో మరోసారి ఎబి డివిలియర్స్ కు సౌత్ ఆఫ్రికా జట్టులో స్థానం దక్కుతుంది అన్న చర్చ మొదలయింది ఇటీవల దీనిపై సౌత్ ఆఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో ఏబీ డివిలియర్స్ అద్భుతంగా రాణించారని డివిలియర్స్ బాగా రాణించినన్ని రోజులు జట్టు ఎంపికలో ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు ఆయన. కరోనా వైరస్ కు ముందే ఎబి డివిలియర్స్ ను జట్టులోకి తీసుకోవడం పై చర్చ జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు.