సౌత్ ఆఫ్రికా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఓటమితో సిరీస్ ను ముగించింది. నిన్న జరిగిన మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోకుండా మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుని పొరపాటు చేసిందని చెప్పాలి. గత రెండు వన్ డే లలో ఛేజింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓటమి పాలయింది. సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసి ఆస్ట్రేలియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ను ఉంచింది. మొదట్లో తడబడిన సౌత్ ఆఫ్రికా, ఆ తర్వాత పుంజుకుని భారీ స్కోర్ చేసింది. ఇందులో మార్కురామ్ మరోసారి చెలరేగి ఆడి తృటిలో సెంచరీ ని చేజార్చుకున్నాడు. ఇతను 87 బంతుల్లో 9 ఫోర్లు మరియు 3 సిక్సులు సహాయంతో 93 పరుగులు చేశాడు. ఇతనికి మిల్లర్ 63 , మార్కో యంసన్ 47 మరియు పెళుక్వయో 39 నుండి చక్కని సహకారం లభించింది. ఇక ఆసీస్ బౌలర్లలో జంపా మూడు, అబాట్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 316 పరుగుల లక్ష్యంతో ఛేదన ఆరంభించిన ఆస్ట్రేలియా కేవలం 193 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి సిరీస్ ను కోల్పోయింది.
ఇంతకు ముందు సిరీస్ 2 – 2 తో సమంగా ఉండగా ఈ మ్యాచ్ లో గెలిచిన సౌత్ ఆఫ్రికా సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా ను యాన్సన్ 5 మరియు మహారాజ 4 వికెట్లు పడగొట్టి పతనాన్ని శాసించారు.