రేపు దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం

-

దక్షిణాది జోనల్ కౌన్సిల్ తదుపరి సమావేశం ఎజెండా ఖరారు కోసం రేపు స్థాయీ సంఘం చెన్నై వేదికగా సమావేశం కానుంది. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కు చెందిన అధికారులు, కేంద్ర హోంశాఖ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. ఈ భేటీలో ప్రస్తావించే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

అంతర్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నదీజలాల కేటాయింపు కోసం చర్యలు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా, తదితర అంశాలను జోనల్ కౌన్సిల్ లో మరోమారు ప్రస్తావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది.

గత సమావేశంలోనూ.. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు, అంతర్ రాష్ట్ర జలవివాదాల చట్టం ప్రకారం నదీజలాల వాటా కోసం సిఫారసు, కాళేశ్వరం లేదా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా, కృష్ణానదిపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది

Read more RELATED
Recommended to you

Latest news